సీఎస్.. రాజ్ భవన్ కనిపించలేదా

సీఎస్.. రాజ్ భవన్ కనిపించలేదా

ప్రభుత్వం పంపించిన బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా.. పెండింగ్ లో పెట్టారని.. బిల్లుల ఆమోదం కోసం ఆదేశాలు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే సీఎస్ కు.. ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు తెలంగాణ గవర్నర్ తమిళిసై. ఢిల్లీ కంటే రాజ్ భవన్ దగ్గరలోనే ఉందని.. సీఎస్ శాంతికుమారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత కనీస మర్యాదగా వచ్చి కలవలేదని.. కనీసం కర్టసీగా ఫోన్ కూడా చేయలేదంటూ స్పష్టం చేశారు గవర్నర్ తమిళిసై. పెండింగ్ బిల్లుల పరిష్కారానికి చర్చల ద్వారా పరిష్కారం వస్తుందని చెబుతూ.. సుప్రీంకోర్టులో రిట్ పిటీషన్ వేయటాన్ని ఎత్తిచూపారు. 

మళ్లీ మళ్లీ గుర్తు చేస్తున్నా.. ఢిల్లీ కంటే రాజ్ భవన్ దగ్గరగా ఉంది అంటూ ట్విట్టర్ ద్వారా ప్రస్తావించిన గవర్నర్.. సీఎస్ శాంతికుమారి వచ్చి మాట్లాడితే అన్ని సమస్యలకు పరిష్కారం అవుతుందని చెప్పకనే చెప్పారు. బిల్లులు పెండింగ్ లో ఎందుకు పెట్టాల్సి వచ్చిందో వివరించటానికి కనీసం ఒక్కసారిగా వచ్చి కలవలేదని.. కనీసం ఫోన్ కూడా చేయలేదనే విషయాన్ని గవర్నర్ తమిళిసై తన ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు.