బీబీనగర్ ఎయిమ్స్ తెలంగాణ  గౌరవ చిహ్నం

బీబీనగర్ ఎయిమ్స్ తెలంగాణ  గౌరవ చిహ్నం
  • బీబీనగర్ ఎయిమ్స్ తెలంగాణ  గౌరవ చిహ్నం
  • ప్రధాని మోడీ మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు

యాదాద్రి భువనగిరి జిల్లా: బీబీనగర్ ఎయిమ్స్ తెలంగాణ  గౌరవ చిహ్నం అన్నారు  గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్. శనివారం ఆమె బీబీనగర్ ఎయిమ్స్ ను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన  గవర్నర్.. ఆయుష్ మాన్ భారత్, జాన్ ఔషధ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.  బీబీ నగర్ ఎయిమ్స్ తెలంగాణ  గౌరవ చిహ్నమని..ప్రతి రాష్ట్రంలో ఇలాంటి ఆసుపత్రులు కావాలని కోరుకుంటున్నానన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించడం  కష్టం అనిపించినా జాగ్రత్తగా ట్రీట్ మెంట్ చేయాలన్నారు. వైట్ కోర్టు అనేది సేవకు స్వచ్ఛతకు చిహ్నమన్న ఆమె.. వైద్య వృత్తి కష్టమైనా డిపరేషన్ కు లోనుకావద్దన్నారు. వైద్య విద్యార్థులు పరిశోధనలో, విద్యలో ఆటలో, అన్ని రంగాల్లో సంతోషంగా వైద్య విద్యను అభ్యసించాలన్నారు. ప్రధాన మంత్రి మోడీ ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని పని చేస్తున్నారని.. దేశ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఆయుష్మాన్ పథకం భారత్ లోనే కాదు ఆసియాలొనే అతిపెద్ద పథకమన్నారు  గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్. సీఎం కేసీఆర్ త్వరగా కోలువాలన్నారు.