విద్యా విధానంపై ఎస్సే కాంపిటీషన్

విద్యా విధానంపై ఎస్సే కాంపిటీషన్
  • వరుసగా 4వ ఏడాది నిర్వహిస్తున్న గవర్నర్  

హైదరాబాద్, వెలుగు: జాతీయ విద్యా విధానంపై గవర్నర్ తమిళిసై వరుసగా నాలుగో ఏడాది ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నారు. “విద్యలో సామాజిక, ఆర్థిక అసమానతలను రూపుమాపడంలో నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ–2020” అనే అంశంపై ఈ కాంపిటీషన్ ఉంటుందని, ఇందులో స్టూడెంట్లతో పాటు, జనరల్ పబ్లిక్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చని రాజ్ భవన్ ఒక ప్రకటనలో పేర్కొంది. 

శనివారం నుంచి ఈ కాంపిటీషన్ స్టార్ట్ అవుతుందని, వచ్చే నెల 6న సాయంత్రం 5 గంటల వరకు ఇంగ్లిష్, తెలుగు భాషల్లో 3 వేల పదాలకు మించకుండా వర్డ్ లేదా పీడీఎఫ్ లో tsrbessaycontest@gmail.com మెయిల్ ఐడీకి ఎస్సే లు పంపాలని నోట్ లో సూచించారు. ఎంపిక చేసిన ముగ్గురు విజేతలకు ఆగస్టు 15న గవర్నర్ చేతుల మీదుగా సన్మానం ఉంటుందని, ఆ ముగ్గురికి రూ.10 వేలు, రూ.5 వేలు, రూ.3 వేల చొప్పున క్యాష్ ప్రైజ్ అందజేస్తారని తెలిపారు.  మరో 20 మందికి రూ.1000 చొప్పున కన్సోలేషన్ ఫ్రైజ్ లు అందజేయనున్నట్లు పేర్కొన్నారు.