జవహర్ నగర్ ఘటనపై గవర్నర్ సీరియస్

జవహర్ నగర్ ఘటనపై గవర్నర్ సీరియస్


హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌లోని జవహర్ నగర్‌‌‌‌లో యువతిపై జరిగిన ఘటన చాలా బాధకరమని గవర్నర్ తమిళిసై అన్నారు. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎస్‌‌, డీజీపీని ఆదేశించారు. అదే విధంగా ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలన్నారు. జవహర్ నగర్ బాలాజీ నగర్‌‌‌‌లో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి మహిళ దుస్తులు చించేసి నగ్నంగా రోడ్డుపై నిలబెట్టిన ఘటన ఇటీవల జరిగింది. చుట్టూ వందల మంది ఉన్నా రక్షించకపోగా ఫొటోలు, వీడియోలు తీశారని బాధితురాలు మీడియాకు వెల్లడించింది. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సైతం సీరియస్ అయింది. నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది.