జాబ్ సీకర్స్ కాదు జాబ్ క్రియేటర్స్ గా వర్శిటీలను తీర్చిదిద్దాలి:గవర్నర్

 జాబ్ సీకర్స్ కాదు జాబ్ క్రియేటర్స్ గా వర్శిటీలను తీర్చిదిద్దాలి:గవర్నర్

వర్శిటీలను జాబ్ సీకర్స్ కాకుండా జాబ్ క్రియేటర్స్ గా తీర్చిదిద్దాలన్నారు గవర్నర్ తమిళి అన్నారు. రాజ్ భవన్ లో  పలు యూనివర్శిటీల వైస్ ఛాన్స్ లర్లతో సమావేశమయ్యారు గవర్నర్. వర్శిటీల్లో సమస్యలు, విద్యార్థుల ఇబ్బందులు, ఆత్మహత్యలపై చర్చించారు. చాలా మంది విద్యార్థులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో ఆలోచించాలన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు మనో ధైర్యాన్ని  నింపాలని సూచించారు.   వైస్ చాన్సలర్ కి లిమిటేషన్స్ ఉన్నాయని తనకు తెలుసనీ.. కానీ  విద్యార్థుల సమస్యలు తీర్చాలన్నారు. కాంట్రవర్సీ క్రియేట్ చేయడం తన ఉద్దేశం కాదని... రాష్ట్ర  ప్రభుత్వంతో తాను కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నానని చెప్పారు. ఇది ఓపెన్ మీటింగ్ అని  మీ సమస్యలు ఏమైనా ఉంటే చెప్పాలన్నారు. తనను  విమర్శించాలనుకునే వారు విమర్శించొచ్చన్నారు గవర్నర్.  

రాష్ట్రంలో మంచి ఫ్రొఫెసర్లు, టాలెంటెడ్  స్టూడెంట్స్  ఉన్నా ర్యాంకింగ్ లో వెనుబడుతున్నామన్నారు తమిళి సై.  విద్యార్థుల సమస్యలు తీర్చాలని... ముఖ్యంగా అమ్మాయిలకు వర్శిటీలలో టాయిలెట్స్ ఏర్పాటు చేయాలన్నారు.  బేసిక్ ఎడ్యుకేషన్ తో పాటు హయ్యర్ ఎడ్యకేషన్  లోపై దృష్టి సారించాలని సూచించారు. 

రాష్ట్రం అభివృద్ధి కావాలంటే మంచి విద్యను అందించాలన్నారు గవర్నర్. విద్యార్థుల కోసం కాన్ఫరెన్స్ లు నిర్వహించాలని సూచించారు. అన్ని యూనివర్శిటీలలో స్పోర్ట్స్ ను ఎంకరేజ్ చేయాలని చెప్పారు.  వర్షపు నీళ్లను ఎలా వాడుకోవాలో అందరికీ తెలియాలన్నారు.  అన్ని యూనివర్శిటీల్లో ఎలాంటివి అమలు చేస్తున్నారో తనకు రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు. బెస్ట్ ప్రాక్టీస్, బెస్ట్ అకాడమీలు నిర్వహిస్తున్న యూనివర్శిటీలకు అవార్డులు అందించాలన్నారు.