రజక బంధు ప్రకటించాకే ఎన్నికల ప్రచారం చేపట్టాలె

రజక బంధు ప్రకటించాకే ఎన్నికల ప్రచారం చేపట్టాలె

చాకలి ఐలమ్మ త్యాగం ఎంతో గొప్పదని రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ అన్నారు. లోయర్ ట్యాంక్ బండ్ లోని తెలంగాణ రజక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ 127వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న గవర్నర్ తమిళి సై... చాకలి ఐలమ్మ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలని కీర్తించారు. నిజాం నవాబు, జమిందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్పయోధురాలని ప్రశంసించారు. పీడిత ప్రజల కోసం ఎనలేని పోరాటం చేసిన మహిళ చాకలి ఐలమ్మ అని, ఆమె త్యాగం ఎంతో గొప్పదని కొనియాడారు.

నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప యోధురాలు చాకలి ఐలమ్మ అని రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ చెప్పారు. భూ శిస్తు విషయంలో పటేల్, పట్వారీలను వ్యతిరేకించిన యోధురాలన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత చాకలి ఐలమ్మకు సముచితమైన గౌరవ మర్యాదలు దక్కడం లేదని ఆరోపించారు. ట్యాంక్ బండ్ పైన కేసీఆర్ ఇప్పటివరకు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదని విమర్శించారు. దళిత, గిరిజన బంధు ఏర్పాటు చేసినట్లే రజక బంధును రజకులకు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రజక బంధు ప్రకటించిన తర్వాతనే టీఆర్ఎస్ పార్టీ మునుగోడు ఎన్నికలకు ప్రచారం చేయాలని చెప్పారు.