ఎప్పుడూ ప్రజలతోనే ఉంటా.. ఎంపీగా పోటీ చేయడంపై గవర్నర్ రియాక్షన్

 ఎప్పుడూ ప్రజలతోనే ఉంటా.. ఎంపీగా పోటీ చేయడంపై గవర్నర్ రియాక్షన్

గవర్నర్ పదవికి రాజీనామా చేసి.. ఎంపీగా పోటీ చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై స్పందిస్తూ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ 30వ తేదీ శనివారం అయోధ్య రామాలయ నిర్మాణంలో భాగస్వామ్యమైన బోయిన్ పల్లిలోని అనురాధ టింబర్ డిపోను గవర్నర్ తమిళిసై  సందర్చించారు. అయోద్య రామ మందిరా ద్వారాలకు తలుపులను అనురాధ టింబర్ డిపో తయారు చేసిన విషయం తెలిసిందే. 

ఈ సందర్భంగా గవర్నర్ మీడిమాతో మాట్లాడుతూ..  ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. రాముడు ప్రతిమ చూసి చాలా సంతోషం కలిగిందన్నారు. ఇది అంత ఈజీ పని కాదు.. చాలా కష్టమైన పని... వీరు ఇంత చక్కగా తీర్చి దిద్దటం చాలా బాగుందని గవర్నర్ ప్రశంసించారు. రామ మందిరంలో అనురాధ టింబర్స్ కూడా ఒక గొప్ప భూమిక పోషించడం ఎంతో గర్వకారణమన్నారు.  తాను ఒక గవర్నర్ గా ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు... అవసరమైతే వాళ్ళనే పిలిపించుకోవచ్చు... కానీ తాను ఆ అద్భుతాలను చూడాలని ఇక్కడికి వచ్చానని తెలిపారు.  మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలుసుకుని వచ్చానన్నారు.

గవర్నర్ గా రాజీనామా అంశంపై ఈ సందర్భంగా ఆమె  స్పందిస్తూ.. ఎంపీగా పోటీ చేస్తానని... తాను అదిష్టానానికి ఎటువంటి విజ్ఞప్తి చెయ్యలేదని స్పష్టం చేశారు. తనకు అధిష్టానం ఏ బాధ్యత అప్పగిస్తే అది ఫాలో అవుతానన్నారు.  తాను రాజీనామా చేశాననే మాటలు అవస్థవమన్నారు. తుత్తుకుడిలో ఒక ప్రోగ్రాంలో పాల్గొనడానికి వెళ్ళానని..  అంతేకాని, రాజీనామా చేసి తుతుకుడి నుండి పోటీ చేస్తున్నట్లు వస్తున్న వార్తలు ప్రచారం మాత్రమేనని వెల్లడించారు. తాను ఇక్కడే ఉంటానని.. ప్రజలతో ఉండడానికి ఇష్టపడతాను...ప్రజల కోసం పని చేయడానికి ఇష్టపడుతానని గవర్నర్ చెప్పారు.