అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కాన్వొకేషన్లో పాల్గొన్న గవర్నర్

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కాన్వొకేషన్లో పాల్గొన్న గవర్నర్

యువత సవాళ్ళను ఎదుర్కోవడం లేదని..ప్రతి ఒక్కరు లక్ష్యాన్ని ఎంచుకుని ముందుకు సాగాలని గవర్నర్ తమిళసై సూచించారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కాన్వొకేషన్లో ఆమె పాల్గొని..విద్యార్థులకు పట్టాలు, గోల్డ్ మెడల్స్ అందించారు. విద్యార్థులు తమ నైపుణ్యాలను మరింత మెరుగుపురుచుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. జీవితం అంటే అంత సులభం కాదని.. కష్టపడితేనే ఏదైన సాధించవచ్చన్నారు. జీవితంలో యోగాను ఒక భాగం చేసుకోవాలని.. యోగ వల్ల ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత వెలువడుతుందన్నారు. 

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో నాణ్యమైన విద్య

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని వీసీ సీతారామారావు తెలిపారు. పట్టాలు అందుకున్న విద్యార్థులకు అభినందనలు తెలిపిన ఆయన.. వారి భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు. కోవిడ్ మహమ్మారి వల్ల 2020-2021లో స్నాతకోత్సవం నిర్వహించలేదన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు పట్టాలు అందుకున్నట్లు తెలిపారు. కోవిడ్ కారణంగా సాంకేతికత సహాయంతో వర్చువల్ తరగతులు నిర్వహించామన్నారు.