రాజ్ భవన్లో యోగా క్లాసులు ప్రారంభించిన గవర్నర్

రాజ్ భవన్లో యోగా క్లాసులు ప్రారంభించిన గవర్నర్

శారీరక  ధారుడ్యం ప్రతి ఒక్కరి జీవిత విధానం కావాలన్నారు గవర్నర్ తమిళి సై సౌందరరాజన్. ఇందు కోసం యోగాను తమ జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు.  సాంకేతికంగా అభివృద్ది చెందడంతో  సమాజంలో చాలామంది శారీరక  శ్రమను తగ్గించారని అన్నారు. కనీసం నడవడం కూడా మానేశారని అన్నారు. రాజభవన్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకంగా యోగా తరగతులను  తమిళసై  రాజ్ భవన్ లో ప్రారంభించారు. గవర్నరు దంపతులిద్దరూ  యోగా తరగతులలో  పాల్గొన్నారు. యోగా తరగతులు సంక్షేమ భవన్ లో ప్రతి రోజూ ఉదయం 5.30 నుండి 6.30 వరకూ నిర్వహిస్తారని, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని గవర్నరు చెప్పారు.