ఉద్యోగాలు కల్పించే దిశగా ముందుకెళ్లాలి : తమిళిసై

ఉద్యోగాలు కల్పించే దిశగా ముందుకెళ్లాలి : తమిళిసై

కంది, వెలుగు: నేటి తరం స్టూడెంట్లు ఉద్యోగాలు కల్పించే దిశగా ముందుకెళ్లాలని గవర్నర్ తమిళిసై సూచించారు. సోమవారం సంగారెడ్డి జిల్లాలో కందిలోని ఐఐటీహెచ్​లో ఆర్ మోహన్ రెడ్డి స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌‌‌‌ప్రెన్యూర్‌‌‌‌షిప్ ఫౌండేషన్ వీక్ సంబరాలలో భాగంగా మూడ్రోజుల వర్క్​షాప్​ను గవర్నర్ తమిళిసై ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్టూడెంట్లు పారిశ్రామిక వేత్తలుగా మారేందుకు మార్గాలను అన్వేషించాలన్నారు. కార్యక్రమంలో భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఎల్లా, స్టూడెంట్లు, ఫ్యాకల్టీ పాల్గొన్నారు.