నెలాఖరుకు సీహెచ్సీ ప్రారంభం.. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

నెలాఖరుకు సీహెచ్సీ ప్రారంభం.. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

పిట్లం, వెలుగు: మార్చి నెలాఖరుకు పిట్లంలో కొత్తగా నిర్మిస్తున్న సీహెచ్​సీని ప్రారంభిస్తామని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు తెలిపారు. శనివారం జిల్లా వైద్యాధికారులతో కలిసి హాస్పిటల్​ను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా హాస్పిటల్​ను ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

కొత్తగా నిర్మించిన భవనంలో  రోగులకు అవసరమయ్యే అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. పిట్లం పరిసరాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో హాస్పిటల్ ను​ నిర్మించినట్లు తెలిపారు.