డాక్టర్ వృత్తి ప్రజల నమ్మకానికి ప్రతీక..నిత్య విద్యార్థులే ఉత్తమ డాక్టర్లవుతరు :  డిప్యూటీ సీఎం భట్టి

డాక్టర్ వృత్తి ప్రజల నమ్మకానికి ప్రతీక..నిత్య విద్యార్థులే ఉత్తమ డాక్టర్లవుతరు :  డిప్యూటీ సీఎం భట్టి
  • ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ సిల్వర్ జూబ్లీ వేడుకలో డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్ సిటీ, వెలుగు: వైద్య వృత్తిలో ప్రతిభ, నైతికత, కరుణ అనేవి మూల సూత్రాలని, ఆధునిక ప్రపంచంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా నిత్యం అధ్యయనం చేస్తూ వృత్తిని కొనసాగించేవారే ఉత్తమ డాక్టర్లుగా గుర్తింపు సాధిస్తారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శనివారం సికింద్రాబాద్ లోని ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ సిల్వర్ జూబ్లీ వేడుకలు, 2026లో పట్టభద్రులైన వారికి కాన్వకేషన్ ప్రోగ్రాం నిర్వహించగా ఆయన చీఫ్ గెస్ట్​గా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జీవితాంతం నిత్య విద్యార్థులుగా ఉండే వారే మంచి డాక్టర్లలవుతారని అన్నారు. వైద్య వృత్తి ప్రజల నమ్మకానికి ప్రతీక అని, ప్రతి రోగికి వినయం, కరుణతో సేవ చేయాలని సూచించారు. ఈ ఏడాది పట్టభద్రుల్లో ఎక్కువ మంది యువతులు ఉండటం సమాజంలో జరుగుతున్న మంచి మార్పుకు సంకేతమన్నారు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చోటు దక్కించుకున్న రాష్ట్రంలోని ఏకైక డెంటల్ కళాశాలగా ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ నిలవడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వీసీ రమేశ్ రెడ్డి, తెలంగాణ డెంటల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కె.రాజేశ్ రెడ్డి, మేజర్ జనరల్ అజయ్ మిశ్రా, కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ మమత కౌశిక్ పాల్గొన్నారు.