ఖైరతాబాద్ గణేష్ తొలిపూజకు గవర్నర్

ఖైరతాబాద్ గణేష్ తొలిపూజకు గవర్నర్
  • రేపు వైభవంగా తొలిపూజ.. పాల్గొననున్న గవర్నర్

హైదరాబాద్: ఖైరతాబాద్ బడా గణేశ్ విగ్రహం వద్ద సందడి నెలకొంది. రేపు తొలిపూజ జరగనున్నప్పటికీ ఇప్పట్నుంచే దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. పంచముఖ శ్రీలక్ష్మీ మహాగణపతిగా దర్శనమిస్తోన్న స్వామివారిని చూడటానికి పెద్ద సంఖ్యలో భక్తులు క్యూ కట్టారు. ఖైరతాబాద్ గణేశ్ విగ్రహం ఏటా  ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి వల్ల రెండేళ్లుగా గణేష్ ఉత్సవాలకు దూరమైన భక్తులు, ప్రజలు ఈసారి ఉత్సవాలు ఉత్సాహంగా జరుపుకునేందుకు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ మండపాలకు తరలివస్తున్న గణేష్ విగ్రహాలతో సందడి వాతావరణం ఏర్పడింది.  ఖైరతాబాద్ గణేష్ మొదటి పూజకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ హాజరుకానున్నారు. రేపు ఉదయం 6 గంటలకు యజ్ఞం తర్వాత.. పద్మశాలి సంఘం వారు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.