గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్..ఉస్మానియా ఆసుపత్రికి గవర్నర్ తమిళిసై

గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్..ఉస్మానియా ఆసుపత్రికి గవర్నర్ తమిళిసై

స్మానియా ఆసుపత్రి విషయంలో గవర్నర్ తమిళిసై వర్సెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం అన్న చందంగా మారింది.  ఈ క్రమంలో గవర్నర్ తమిళిసై ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.  ఉస్మానియా ఆసుపత్రికి చేరుకున్న గవర్నర్ తమిళిసైకి అక్కడి వైద్యులు స్వాగతం పలికారు. ఉస్మానియా ఆసుపత్రిని గవర్నర్ పరిశీలిస్తున్నారు. 

బాధగా ఉంది...

ఉస్మానియా నూతన భవాన నిర్మాణం చేపట్టాలని ట్విట్టర్ లో గవర్నర్ తమిళిసై పేర్కోన్నారు. ఉస్మానియా ఆసుపత్రికి ఎంతో గొప్ప చరిత్ర ఉందని..అయితే ప్రస్తుతం ఆసుపత్రిని చూస్తుంటే బాధేస్తోందని చెప్పారు.  గవర్నర్ వ్యాఖ్యలపై  మంత్రి హరీష్  రావు ఘాటుగా స్పందించారు. గవర్నర్ కు  అభివృద్ధి కనిపించడం లేదని వ్యాఖ్యానించారు.  గవర్నర్ తీరు కోడి గుడ్డుపై ఈకలు పీకినట్లుగా ఉందని మండిపడ్డారు. బీజేపీ ప్రతినిధిలా  గవర్నర్ మాట్లాడుతున్నట్లు స్పష్టంగా అర్థం అవుతుందని మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో గవర్నర్ ఉస్మానియా ఆసుపత్రి సందర్శన తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. 

ALSO READ:పవన్ మ్యాజిక్ రిపీట్.. ఇరగదీసిన నాగ శౌర్య, జానీ

సీఎంవోకు లెటర్లు..

మరోవైపు ఉస్మానియా నూతన భవనాన్ని నిర్మించాలని  డిమాండ్ చేస్తూ జస్టిస్ ఫర్ OGH పేరుతో ఇండియన్ పోస్ట్ ద్వారా 8 వందల లెటర్లు వచ్చాయి. ఇందులో సీఎంవో అడ్రెస్ పేరుతో 400 లెటర్లు రాగా..చీఫ్ట్ జస్టిస్ హైకోర్టు అడ్రెస్ తో మరో 400 లేటర్లు వచ్చాయి.