
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో గవర్నర్ తమిళ సై పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆమె అశ్వాపురం గ్రామంలో ఎస్.కే.టీ పంక్షన్ హాల్ ఉన్న పునరావాస కేంద్రంనికి చేరున్నారు. వరద బాధితులకు, చిన్నారులకు, బిస్కెట్లు, హెల్త్ కిట్టులను పంపిణీ చేశారు. వరద బాధితులతో గవర్నర్ ప్రత్యేకంగా మాట్లాడారు. అయితే తమను కలువకుండా అధికారులతో మాత్రమే మాట్లడటం ఏంటని స్థానికులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో వరద బాధితుల నుంచి గవర్నర్ కు నిరసన సెగ తగిలింది. మహిళలు అరుపులు, కేకలతో తీవ్ర నిరసనల మధ్య గవర్నర్ గెస్ట్ హౌస్ కు వెనుదిరిగి వెళ్లిపోయారు.
కాగా, ఈ పర్యటన కోసం గవర్నర్ తమిళ సై రైలు మార్గాన మణుగూరుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కొత్తగూడెం గిరిజన సంక్షేమ డీడీ రమాదేవి, ఆర్డీవో స్వర్ణలత పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. ఏఎస్పీ కె.ఆర్.కె ప్రసాదరావు ఆధ్వర్యంలో గవర్నర్ కు పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.