సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలి : తమిళిసై

సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలి : తమిళిసై

అస్వస్థతకు గురై గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికత్స పొందిన సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని గవర్నర్ తమిళిసై ఆకాంక్షించారు. సీఎం పూర్తి ఆరోగ్యంగా ఉండాలని ఆమె ట్వీట్ చేశారు. గతకొంతకాలంగా ప్రభుత్వం, గవర్నర్ మధ్య వివాదాలు తారాస్థాయికి చేరిన వేళ గవర్నర్ ట్వీట్ చేయడం ప్రాధన్యతను సంతరించుకుంది. 

ఆదివారం ఉదయం నుంచి కడుపునొప్పితో బాధపడుతున్న సీఎం కేసీఆర్ ను కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో కేసీఆర్‌కు ప్రత్యేక వైద్య బృందం ఎండోస్కోపీ పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో సీఎం కేసీఆర్కు అల్సర్ ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. ప్రస్తుతం సీఎం ఆరోగ్యం నిలకడగా ఉందంటూ ఏఐజి హాస్పిటల్ డాక్టర్లు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. మరోవైపు జనరల్ చెకప్‌లో భాగంగానే ఆస్పత్రికి వచ్చినట్లు ఏఐజీ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.