
సీఎం కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి అనారోగ్యంతో హాస్పిటల్కు వెళ్లారని తెలిసి ఆందోళన చెందానని అన్నారు. సీఎం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఫ్లవర్ బొకేతో పాటు ఓ లెటర్ పంపారు. కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థిస్తున్నట్టు లేఖలో రాశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. నీరసంతో పాటు ఎడమచేయి నొప్పిగా ఉండటంతో డాక్టర్ల సూచన మేరకు సోమాజీగూడలోని యశోద హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. టెస్ట్ రిజల్ట్స్ అన్నీ నార్మల్గానే వచ్చాయని, సీఎం ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు చెప్పారు.