ఆసుపత్రుల్లో సదుపాయాలు మెరుగుపర్చాలె

ఆసుపత్రుల్లో సదుపాయాలు మెరుగుపర్చాలె

హైదరాబాద్: కార్పొరేట్ ఆసుపత్రుల తరహాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలను మెరుగుపరచాలని రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ సూచించారు. ఇంటర్నేషనల్ నర్సెస్ డే సందర్భంగా అల్లైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశిష్ట సేవలను అందించిన నర్సులకు ఫ్లోరెన్స్ నైట్ఎంగేల్ నర్సెస్ అవార్డులను రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ ముఖ్య అతిధిగా పాల్గొని అందజేశారు. హైదరాబాద్ కోఠి లోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యాలయంలో ఈ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ... వైద్యులుగా  వృత్తి ప్రారంభించిన వారికి మొదటి గురువు నర్సులే అని అన్నారు. డాక్టర్లు లేకున్నా క్లినిక్ లు నడుస్తాయి కానీ , నర్సులు లేకుంటే ఏ క్లినిక్  నడవదని తెలిపారు. క్రిటికల్ స్టేజ్ లో ఉన్న రోగులను నర్సులు కంటికి రెప్పలా చూసుకోవడం వల్లే వాళ్ల రోగం నయం అవుతుందని చెప్పారు. దేశంలో వ్యాక్సినేషన్ విజయవంతంగా జరిగుతోందంటే... ఆ ఘనత నర్సులకే దక్కుతుందన్నారు.  రోగులను బాగోగులు చూసుకోవడంతో పాటు... నర్సులు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలని సూచించారు.

మరిన్ని వార్తల కోసం...

స్టడీ సర్టిఫికెట్ల కోసం గ్రూప్-1 అభ్యర్థుల తిప్పలు

ఎయిరిండియా కొత్త సీఈఓగా క్యాంబెల్ విల్సన్