హైదరాబాద్: ఇవాళ (జులై 21)‘ ప్రణామ్’ ఓపెనింగ్...వృద్ధుల కోసం మల్టీ సర్వీస్ డే కేర్ సెంటర్

హైదరాబాద్: ఇవాళ (జులై 21)‘ ప్రణామ్’ ఓపెనింగ్...వృద్ధుల కోసం మల్టీ సర్వీస్ డే కేర్ సెంటర్
  •     ప్రారంభించనున్న గవర్నర్​

హైదరాబాద్ సిటీ, వెలుగు:  మాసాబ్‌‌ట్యాంక్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ  భవనంలో వృద్ధుల కోసం ఏర్పాటు చేసిన ‘ప్రణామ్’  మల్టీ-సర్వీస్ డే కేర్ సెంటర్‌‌ను గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా మంగళవారం ప్రారంభించనున్నారు. ఈ కేంద్రంలో ఒకేసారి 100 మంది వృద్ధులకు సేవలు అందించొచ్చు. వారికి  క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు, మందుల పంపిణీ, పోషకాహారం, మానసిక ఆరోగ్య సలహాలు, డిజిటల్ ఎడ్యుకేషన్​ట్రైనింగ్​, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, కల్చరల్​ప్రోగ్రామ్స్​, బ్రేక్ ఫాస్ట్ వంటి సేవలు అందుబాటులో ఉంటాయి. 

ఈ కేంద్రాన్ని మోడల్ డే కేర్ సెంటర్‌‌గా అభివృద్ధి చేసేందుకు గవర్నర్ ఆఫీసు రూ.13.57 లక్షలు, జిల్లా కలెక్టరేట్​నుంచి రూ.11.57 లక్షలు కేటాయించగా, కేంద్ర ప్రభుత్వం అటల్ వయో అభ్యుదయ యోజన పథకం కింద తొలి విడతగా రూ.12.43 లక్షలు మంజూరు చేసింది. వృద్ధుల్లో ఒంటరితనాన్ని తగ్గించి, ఆరోగ్యకరమైన వృద్ధాప్యాన్ని ప్రోత్సహిస్తూ, సమాజంలో గౌరవప్రదమైన జీవనానికి తోడ్పడటమే ఈ కేంద్రం ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.