నిజామాబాద్‌‌ ఎమ్మెల్సీ ఎన్నిక తర్వాతే గవర్నర్ కోటా భర్తీ

నిజామాబాద్‌‌ ఎమ్మెల్సీ ఎన్నిక తర్వాతే గవర్నర్ కోటా భర్తీ

హైదరాబాద్, వెలుగు: నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నిక తర్వాతే గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీపై సీఎం కేసీఆర్ ఫోకస్ పెట్టనున్నారని టీఆర్ఎస్ లీడర్లు అంటున్నారు. నిజామాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ స్థానానికి వాయిదాపడిన ఎలక్షన్ ఈ నెలాఖరు లేదా వచ్చె నెల మొదటి వారంలో జరిగే చాన్స్ ఉందని చెప్తున్నారు. భూపతి రెడ్డి అసెంబ్లీఎన్నికల టైంలో కాంగ్రెస్ లో చేరడంతో ఆయనపై అనరత వేటు పడింది. దీంతో నిజామాబాద్ ఎమ్మెల్సీ్ ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చింది. టీఆర్ఎస్ అభ్యర్థి కవిత మార్చిలో నామినేషన్ వేశారు. కానీ లాక్ డౌన్ రావడంతో ఎలక్షన్ 45 రోజులు వాయిదా పడింది. గతనెలలో మాజీ ఎంపీ,ప్లానింగ్ బోర్డువైస్ చైర్మన్ వినోద్ కుమార్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి , వాయిదా గడువు ముగిసినందున ఎలక్షన్ నిర్వహించాలని కోరినట్టు తెలిసింది.

మూడుపేర్లు ఒకేసారి ఎంపిక

గవర్నర్ కోటాలోని 3 ఎమ్మెల్సీపదవుల భర్తీ ఒకేసారి ఉంటుందని పార్టీలో చర్చ జరుగుతోంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఉన్న కర్నె ప్రభాకర్ టర్మ్ ఈ నెలాఖరుకు ముగుస్తోంది. నాయిని నర్సింహా రెడ్డి టర్మ్ జూన్ లో ముగిసింది. రాములు నాయక్ పార్టీమారడంతో ఆయనపై అనరత వేటు పడి ఆ స్థానం ఖాళీ అయింది. ఈ మూడు స్థానాలకు ఒకేసారి పేర్లను నామినేట్ చేసే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్టు పార్టీలో ని ఓసీనియర్ నేత తెలిపారు.

ధీమాగా..నాయిని, కర్నె

మాజీ హోం మంత్రి నాయిని, కర్నె ప్రభాకర్ తమకు ఎమ్మెల్సీగా మరో చాన్స్ దక్కుతుం దని ధీమాగా ఉన్నట్టువారి సన్నిహితులు చెప్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తన అల్లుడికి టికెట్ ఇవ్వనందుకు, తనకు మరోసారి ఎమ్మెల్సీపదవిని కేసీఆర్ ఇస్తారని నాయిని నమ్మకంతో ఉన్నారని అంటున్నారు. కానీ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి, దానికి నాయినిని చైర్మన్ గా నియమించే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. జీహెచ్ఎంసీ ఎలక్షన్ తర్వాత నాయిని అల్లుడిని డిప్యూటీ మేయర్ గా నియమించే చాన్స్ ఉన్నట్టుచెప్తున్నారు. ఎమ్మెల్సీగా సభలో, బయట కర్నె ప్రభాకర్ వ్యవహరించిన తీరుపై సీఎం కేసీఆర్ సంతృప్తిగా ఉన్నారని, అందుకే ఆయన్ను మళ్లీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తారని ఆయన సన్నిహితులు అంటున్నారు. రాములు నాయక్ స్థానాన్ని తనకు ఇస్తారని మాజీ ఎంపీ సీతారాం నాయక్ ధీమాలో ఉన్నారు. కానీ చాలా మంది లీడర్లు తమ అదృష్టం పరీక్షించుకునే పనిలోపడ్డారు. సమయం వచ్చిన ప్రతిసారి కేటీఆర్ ను కలిసి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.

కొత్త వారికిచాన్స్ ఇవ్వాలె

ఈసారి కొత్త వారికి ఎమ్మెల్సీ చాన్స్ ఇవ్వాలని పార్టీలో డిమాండ్ ఉంది. మళ్లీ మళ్లీ వారికే పదవులు ఇస్తే పార్టీలో ఉన్న మిగతా వారి పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ కోసం చాలా మంది పోటిపడుతున్నారు. వరంగల్ జిల్లా నుంచి మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ ఎంపీ గుండు సుధారాణి, తక్కెళప్ల ల్లి రవీందర్ రావు పోటీ పడుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ నుంచి అరెకల నర్సారెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరావు, కరీంనగర్ నుంచి తుల ఉమ, ఖమ్మం జిల్లానుంచి మాజీ మంత్రి తుమ్మల,మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ నుంచి మందుల సామేలు, గ్రేటర్ హైదరాబాద్ నుంచి బండి రమేశ్‌, క్యామ మల్లేష్ పోటీ పడుతున్నారు. టీఆర్ఎస్ ఎల్పీసెక్రటరీ రమేష్ రెడ్డి కూడా ఎమ్మెల్సీస్థానాన్ని ఆశిస్తున్నట్టుతెలిసింది.

పీవీకుమార్తె ఎంట్రీతో..

గవర్నర్ కోటాలోఎమ్మెల్సీగా పీవీ కూతురు వాణీ దేవిని సీఎం కేసీఆర్ ఎంపిక చేస్తారనే ప్రచారంతో టీఆర్ఎస్ లోనిబ్రాహ్మణ లీడర్లు టెన్షన్ పడుతున్నారు. ఎమ్మెల్సీ పదవికోసం దేవీ ప్రసాద్, దేశపతి శ్రీనివాస్ ఆశపడుతున్నారు. ఇప్పుడు వాణీ దేవి ఎంటరవడంతో తమ చాన్స్ కు ఆమె గండి కొడుతుందేమోనని వారు టెన్షన్ పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సర్కారు నిర్వహిస్తున్న పీవీ శతజయంతి ఉత్సవాల కారణంగా వాణీ దేవి తరచుగా సీఎం కేసీఆర్ ను కలుస్తున్నారు. కాంగ్రెస్ లోపీవీకి అన్యాయం జరిగిందని కేసీఆర్ అన్నారు. వాణీ దేవిని ఎమ్మెల్సీగా ఎంపికచేసి ఆ కుటుంబానికి న్యాయం చేశామని కాంగ్రెస్ ను ఇరుకున పెట్టే వ్యూహంలో కేసీఆర్ ఉన్నట్టు ప్రచారం జరిగింది. వాణీదేవి కూడా తనకుఎమ్మెల్సీ పదవి ఇస్తే తీసుకుంటాననిచెప్పారు. దీంతో టీఆర్ఎస్ లోనిబ్రాహ్మణ లీడర్లకు టెన్షన్ మొదలైంది.