
మెదక్ టౌన్, వెలుగు : మెదక్ జిల్లా వ్యవసాయ అధికారి (డీఏవో)గా గోవింద్ బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఆదివారం జిల్లా కలెక్టరేట్లోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో జిల్లా వ్యవసాయ అధికారిణిగా ఇప్పటి వరకు విధులు నిర్వహించిన ఆశాకుమారి నుంచి గోవింద్ ఛార్జి తీసుకున్నారు. ఆయన హైదరాబాద్ వ్యవసాయ కమిషనర్ కార్యాలయం నుంచి బదిలీపై రాగా, మెదక్లో విధులు నిర్వహిస్తున్న ఆశాకుమారి హైదరాబాద్కు బదిలీపై వెళ్లారు.
ఈ సందర్భంగా గోవింద్ మాట్లాడుతూ రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, వారికి ఎపటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేలా కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో డీఏవో కార్యాలయ సిబ్బంది ఆశా వెరోనికా, విఠల్, ఏవోలు గంగమల్లు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.