డబ్బున్నోళ్లకే పథకాలా?.. మంత్రి కొప్పులను నిలదీసిన గ్రామస్తులు

డబ్బున్నోళ్లకే పథకాలా?..  మంత్రి కొప్పులను నిలదీసిన గ్రామస్తులు

జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం గోవిందుపల్లెలో సోమవారం ఎన్నికల ప్రచారానికి వచ్చిన మంత్రి కొప్పుల ఈశ్వర్ కాన్వాయ్‌‌ని గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో ఆయన వెహికల్​ దిగాల్సి వచ్చింది. నేరెళ్ల గ్రామ పంచాయతీ నుంచి కొత్తగా గోవిందుపల్లె జీపీగా ఏర్పడి ఏండ్లు గడుస్తున్నా ఇప్పటివరకు గ్రామ హద్దులు చూపలేదని గ్రామస్తులు నిలదీశారు.

 దళిత బంధు, బీసీ బంధు పథకాల మంజూరులోనూ అక్రమాలు జరిగాయని, ఆర్థికంగా ఉన్నవారికే ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మంత్రి కొప్పుల ఈశ్వర్​గన్ మెన్ గ్రామస్తులను అడ్డుకుని మినిస్టర్‌‌‌‌ను తీసుకొని వెళ్లిపోయారు.