మోడీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ.టీకా ఉత్సవాలు జరుపుకోవడం కాదని.. అందుకు తగ్గట్లు వ్యాక్సిన్లు కూడా అందుబాటులో ఉంచాలన్నారు. దేశంలో కేసలు పెరుగుతుండటంతో అర్హులైన అందరికీ గరిష్ట సంఖ్యలో టీకాలు ఇచ్చేందుకు గత నెల 11 నుండి 14 వరకు బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం టీకా ఉత్సవ్ జరుపుకుందని అన్నారు. అయితే వ్యాక్సిన్లు సరఫరా చేయడంలో విఫలమైందని..దీంతో వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఆలస్యం జరుగుతోందని విమర్శించారు. అత్యధికంగా వ్యాక్సిన్ ఉత్పత్తులు చేస్తున్న దేశం భారత్ అని, కానీ వ్యాక్సినేషన్ ప్రక్రియలో వెనుకంజలో ఉందన్నారు. వ్యాక్సిన్లను అందించకపోవడంతో నెలరోజుల్లో 82 శాతం క్షీణత ఉందని చెప్పారు. ఈ సందర్భంగా రెండు గ్రాఫ్‌ను ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో అమెరికా, యుకె, టర్కీ వెనుక భారత్ ఉన్న గ్రాఫ్, నెల రోజుల్లో వ్యాక్సినేషన్ సంఖ్యలో తేడా ఉన్న గ్రాఫ్‌ను షేర్ చేశారు.
మోడీ వ్యాక్సిన్ కర్మాగారానికి వెళ్లారు..అక్కడ ఫోటోలు దిగారని తెలిపారు ప్రియాంక గాంధీ. అయితే.. కేవలం ఈ ఏడాది జవవరిలో మాత్రమే మొదటి ఆర్డర్ ఇవ్వడం వెనుక ఉద్దేశ్యం ఏంటని ప్రశ్నించారు. చాలా దేశాలు ఇప్పటికే భారత వ్యాక్సిన్ కంపెనీలకు ఆర్డర్లను ఇచ్చాయని తెలిపారు.
भारत सबसे बड़ा वैक्सीन उत्पादक देश है।
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) May 12, 2021
भाजपा सरकार ने 12 अप्रैल को टीका उत्सव मना दिया, लेकिन वैक्सीन की कोई व्यवस्था नहीं की और इन 30 दिनों में हमारे टीकाकरण में 82% की गिरावट आई।
मोदी जी वैक्सीन फैक्ट्रियों में गए, फोटो भी खिंचाई मगर उनकी सरकार ने वैक्सीन का पहला ऑर्डर 1/2 pic.twitter.com/5VEOhQNbmN
