కీచక ప్రభుత్వ ఉద్యోగి.. ఆరేళ్ల బాలికకు వేధింపులు, మేకపై అత్యాచారం

కీచక ప్రభుత్వ ఉద్యోగి.. ఆరేళ్ల బాలికకు వేధింపులు, మేకపై అత్యాచారం

ఓ 50 ఏళ్ల కీచక ప్రభుత్వ ఉద్యోగి ఉదంతమిది. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆరేళ్ల బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉద్యోగి.. అంతటితో సంతృప్తి చెందకపోవడంతో వెళ్తూ వెళ్తూ అదే ఇంట్లో స్తంభానికి కట్టేసిన మేకపై అత్యాచారం చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో కలకలం రేపింది.  

నిందితుడిని 50 ఏళ్ల గజేంద్ర సింగ్ ‌గా గుర్తించిన పోలీసులు అతడు ADO(అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌)గా పనిచేస్తున్నట్లు నిర్ధారించారు. మొదట గజేంద్ర సింగ్ తనకు తెలిసిన వారి ఇంటికి వెళ్లి అక్కడ ఒంటరిగా ఉన్న బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఎక్స్‌లో వైరల్ అవుతోన్న వీడియోలలో, సింగ్ మంచంపై పడుకొని తన ప్రైవేట్ భాగాన్ని తాకమని బాలికను వేధించాడు. అభం శుభం తెలియని చిన్నారిని ముద్దు కూడా పెట్టుకున్నాడు. అంతటితో సంతృప్తి చెందకపోవడంతో ఇంట్లోని స్తంభానికి కట్టేసిన మేకపై అత్యాచారం చేశాడు. 

ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే పోలీసు బృందం, ఫోరెన్సిక్ విభాగం అధికారులు ఘటనాస్థలికి చేరుకుని నమూనాలను సేకరించారు. అనంతరం నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నెట్టింట వైరల్ అవుతోన్న దృశ్యాలను పక్కింటి వ్యక్తి చిత్రీకరించాడని పోలీసులు తెలిపారు.