కరోనా కేసుల విషయంలో కేంద్రానివన్నీ అబద్ధాలే

కరోనా కేసుల విషయంలో కేంద్రానివన్నీ అబద్ధాలే

హైదరాబాద్: కరోనా కేసుల విషయంలో కేంద్ర ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. పాజిటివ్ కేసుల వివరాలను కేంద్రం దాస్తోందన్నారు. దేశ జనాభాలో 2 శాతం  కంటే తక్కువ మంది కరోనా బారిన పడ్డారని కేంద్రం చెప్పడం మీద ఓవైసీ సీరియస్ అయ్యారు. 'దేశ జనాభాలో కేవలం 1.8 శాతం ప్రజలు మాత్రమే కరోనా బారిన పడ్డారని కేంద్రం చెబుతోంది. గత డిసెంబర్, జనవరి నెలల్లో ప్రభుత్వం చేపట్టిన సర్వేలో 21.4 శాతం మందిలో యాంటీ బాడీస్ ఉన్నట్లు తేలింది. సెకండ్ వేవ్ తర్వాత ఆ సంఖ్య మరింత అధికంగా ఉండాలి.  ప్రభుత్వ లెక్కలు నమ్మేలా లేవు. వేలాది కేసుల విషయంలో టెస్టులు సరిగ్గా చేయడం లేదు. అలాగే పాజిటివ్ కేసులను కౌంట్ చేయట్లేదు. ముఖ్యంగా ఆరోగ్య సదుపాయాలు తక్కువగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లో ఇది ఎక్కువగా జరుగుతోంది' అని ఓవైసీ పేర్కొన్నారు.