
జీవితంలో ఒక్కసారైనా దేశవిదేశాల్లో ఉన్న ఫేమస్ టూరిస్ట్ స్పాట్స్ చూడాలని చాలామంది కలలు కంటారు. కానీ, పక్క రాష్ట్రంలో ఉన్న వాటిని కూడా చూడలేకపోతారు. ఖర్చుని తలుచుకొని భయంతో టూర్ ప్లాన్ చేయడానికి చాలా ఆలోచిస్తారు. బాగా ఖర్చవుతుంది కాబట్టి, విమానం నుంచి ట్రైన్ జర్నీకి షిప్ట్ అవుతారు. తక్కువలో వచ్చే ఫుడ్ తింటారు. కానీ, ఒక రాత్రి ఎక్కడైనా కంఫర్టబుల్‌గా, సేఫ్‌గా స్టే చేయాలంటే మాత్రం మంచి హోటల్‌కి వెళ్లాల్సిందే. అక్కడ వాళ్లకు కట్టాల్సిన రేట్లకి పర్స్ ఖాళీ అవుతుంది! ఇందుకే..చాలామంది టూర్ ప్లాన్ చేసేందుకు వెనకాడతారు. అయితే, మనదేశంలో పాపులర్ టూరిస్ట్ ప్లేసుల్లో గవర్నమెంట్ హోటల్స్ ఉన్నాయని చాలామందికి తెలియదు. అక్కడికెళితే మూడు వేల రూపాయల్లోపే హ్యాపీగా టూర్‌ని ఎంజాయ్ చేయొచ్చు. ఈ హోటల్స్ మీ టూర్ ప్లాన్స్‌ని సక్సెస్ చేస్తాయి!
పహల్గామ్
జేకేటీడీసీ హోటల్ ఆల్పైన్ పహల్గామ్
సింపుల్‌గా, ప్రశాంతమైన వెకేషన్ కోసం చూస్తున్నారా? పహల్గామ్‌ని చూస్తే.. చాలు ఇంకేం అక్కర్లేదు. అనంత్‌నాగ్‌లోని షెఫర్డ్స్ లోయ అందాలు చూస్తున్నప్పుడే.. జేకేటీడీసీ ఆల్పైన్ హోటల్‌లో రిజర్వ్ చేసుకోవచ్చు.
డబుల్ బెడ్‌రూమ్ కాటేజ్ ధర: రూ. 2,000
ఫోన్ నెంబర్: 0194 2502274, 0191 2549065
టూర్‌కి అనుకూలం: ఏప్రిల్ – అక్టోబర్ మధ్య
సిమ్లా
ది పీటర్‌హాఫ్
ప్రకృతితో మమేకం కావాలనుకునేవాళ్లకు సిమ్లా బెస్ట్ ప్లేస్. దేశంలోనే ఇది పాపులర్ హిల్ స్టేషన్. చాలామంది కపుల్స్ అందమైన హిల్‌స్టేషన్ చూడటానికి వచ్చేముందే ‘ది పీటర్‌హాఫ్’లో రిజర్వేషన్ చేయిచుకుంటే టూర్ మరింత ఆహ్లాదం అవుతుంది. సిమ్లాలోని పీటర్‌హాఫ్ రోడ్, ఆల్ ఇండియా రేడియో స్టేషన్ పక్కనే ఈ హోటల్ ఉంది.
డబుల్ బెడ్‌రూమ్ కాటేజ్ ధర: ₹2,700
ఫోన్ నెంబర్: (0177)-–2812236, 2652538
టూర్‌కి అనుకూలం: మార్చి నుంచి జూన్ మధ్య
ఖరపతార్
ది గిరిగంగా రిసార్ట్
హిమాచల్ ప్రదేశ్‌లో హిమలయ అందాలు, గంగాలోయ అందాలను చూసి అలసిపోయిన వాళ్లకు ‘ది గిరిగంగా రిసార్ట్’ స్వాగతం పలుకుతుంది. ఇక్కడ ప్రతిరూమ్‌కి బాల్కనీ ఉండటం స్పెషాలిటీ! ఖరపతార్‌లోని తియోగ్‌హట్‌కొటిరోహ్రు రోడ్‌లో ఉన్న ఈ రిసార్ట్ బాల్కనీ నుంచి చూస్తే.. లోయ అందాలు కనువిందు చేస్తాయి.
డబుల్ బెడ్‌రూమ్ కాటేజ్ ధర: ₹1,600
ఫోన్ నెంబర్:(01781) – 251139
టూర్‌కి అనుకూలం: మార్చి నుంచి జూన్ మధ్య
కాసౌలి
ది రోస్ కామన్
పొల్యూషన్‌కి దూరంగా వెళ్లి పర్వతాల మీదుగా వచ్చే స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడానికి ఢిల్లీలో చాలామంది వీకెండ్‌కి కాసౌలికి వెళ్తుంటారు. హిమచల్ ప్రదేశ్‌లోని సోలాన్ జిల్లాలో ఉన్న ఈ ప్రదేశంలో సైనిక స్థావరాలు కూడా ఉంటాయి. ఇక్కడ హిమాచల్ టూరిజం డిపార్ట్‌మెంట్ నడుపుతున్న హోటల్ ‘ది రోస్ కామన్’ చాలా తక్కువ ధరకే అన్ని సదుపాయాలు కల్పిస్తోంది.
డబుల్ బెడ్‌రూమ్ కాటేజ్ ధర: రూ. 2,700
ఫోన్ నెంబర్: (0177)-2812236, 2652538
టూర్‌కి అనుకూలం: మార్చి నుంచి జూన్ మధ్య
ఉదయ్‌పూర్
హోటల్ ఆనంద్ భవన్
మేవార్ రాజ్‌పుత్‌లు 90 ఏళ్ల కింద, బ్రిటిష్ అధికారుల విడిది కోసం ఈ భవనాన్ని నిర్మించారు. స్వాతంత్ర్యం వచ్చాక ఈ అందమైన భవనాన్ని ప్రభుత్వం హోటల్‌గా మార్చింది. ఫతేసాగర్ రోడ్‌లో పర్వతం అంచు మీద ఉండే ‘హోటల్ ఆనంద్ భవన్’ నుంచి చూస్తే.. అందమైన ఫతే, స్వరూప్ సాగర్ సరస్సులు కనువిందు చేస్తాయి.
డబుల్ బెడ్‌రూమ్ కాటేజ్ ధర: రూ.1,900
ఫోన్ నెంబర్:+91-294-2523018
టూర్‌కి అనుకూలం: నవంబర్ – ఫిబ్రవరి మధ్య
జైసల్మేర్
హోటల్ మూమల్
ప్రిన్స్ మహేంద్ర, యువరాణి మూమల్ ప్రేమ కథ ఫేమస్. వాళ్ల ప్రేమ కథకు గుర్తుగా మూమల్ పేరే ఈ హోటల్‌కి పెట్టారు. ఈ హోటల్ నుంచి చూస్తే జైసల్మేర్ కోట అద్భుతంగా కనిపిస్తుంది.
రాజస్తానీ వంటలు ఈ హోటల్‌లో ఫేమస్. జైసల్మేర్ టూర్‌కి వెళ్లినప్పుడు సామ్ రోడ్‌లో పోలీస్ లైన్‌లో ఉండే హోటల్ మూమల్‌కి వెళితే.. మంచి అనుభూతితో పాటు లోటు బడ్జెట్ రాకుండా ఉంటుంది.
డబుల్ బెడ్‌రూమ్ కాటేజ్ ధర: రూ. 1,800
ఫోన్ నెంబర్: 02992-252392
టూర్‌కి అనుకూలం: అక్టోబర్ – మార్చి మధ్య
జోద్‌పూర్
హోటల్ ఘూమర్
రాజస్తాన్‌లోని జోద్‌పూర్‌కి వెళితే అక్కడ రైల్వేస్టేషన్, బస్‌స్టేషన్లకు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే హోటల్ ఘూమర్ ఉంటుంది. ఈ హోటల్‌కి చాలా క్లీన్‌గా ఉంటుందని పేరు. జోద్‌పూర్ హైకోర్టు రోడ్‌లో ఈ హోటల్ ఉంటుంది.
డబుల్ బెడ్‌రూమ్ కాటేజ్ ధర: రూ.2000
ఫోన్ నెంబర్: 0291-2544010
టూర్‌కి అనుకూల సమయం: అక్టోబర్ – మార్చి
గోవా
ఫామ్‌గుడి రెసిడెన్సీ
గోవా అంటే కేవలం బీచ్‌కే ఫేమస్ కాదు. గోవాకు సమీపంలో ఉండే పొండాలో 300 పురాతన ఆలయాలు ఉంటాయి. బీచ్‌లో ఎంజాయ్ చేసి పొండాలో గుళ్లు చూస్తూ ఎంజాయ్ చేస్తారు చాలామంది. రాత్రి అక్కడే ఉండాలనుకునేవారి కోసం ఫార్మసీ కాలేజీ పక్కన ఫామ్‌గుడి రెసిడెన్సీ స్వాగతం పలుకుతుంది. అందమైన కాటేజ్‌లతో పాటు ఇక్కడ ఇండోర్, అవుట్‌డోర్ రెస్టారెంట్స్ అందుబాటులో ఉన్నాయి.
డబుల్ బెడ్‌రూమ్ కాటేజ్ ధర: రూ.1,500
ఫోన్ నెంబర్: +(91)-(832)-2335122 / 2335037
టూర్‌కి అనుకూలం: నవంబర్ 15 నుంచి ఫిబ్రవరి 15
కేరళ
పెప్పర్ గ్రోవ్
దైవభూమిగా పేరుగాంచిన కేరళ అందాల్ని ఒక్కసారైనా చూడాలని చాలామంది కలలు కంటారు. వయనాడ్ సెంటర్‌లోని మనిచీర దగ్గర ఉండే కేటీడీసీ పెప్పర్‌గ్రోవ్‌లో దిగితే.. ఈజీగా వయనాడ్ మొత్తం చుట్టిరావొచ్చు. పెప్పర్‌గ్రోవ్ హోటల్ నుంచి ఎడక్కల్ గుహలు, ముతంగా వైల్డ్‌లైఫ్ శాంక్చురీకి వేగంగా చేరుకోవచ్చు.
డబుల్ బెడ్‌రూమ్ కాటేజ్ ధర: రూ.2,000
ఫోన్ నెంబర్:+91-4936-221900
కేరళ టూర్‌కి అనుకూలం: సెప్టెంబర్ నుంచి మార్చి మధ్య
శ్రీనగర్
జేకేటీడీసీ చేశ్మాసాహి రిసార్ట్
మన దేశంలో అత్యంత అందమైన ప్రదేశాల్లో ఈ రిసార్ట్ ఉంది. ఇక్కడ ఎటు చూసినా.. అందమైన మంచు పర్వతాలు కనువిందు చేస్తుంటాయి. ఈ హోటల్ శ్రీనగర్ టూర్‌ని మరింత సంతోషంగా మారుస్తుందనడంలో కొంచెం కూడా సందేహం లేదు.
సింగిల్ బెడ్‌రూమ్ కాటేజ్ ధర: రూ.2,500
ఫోన్ నంబర్: 0194 2502274 , 0191 2549065
టూర్‌కి అనుకూలం: ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య
మరిన్ని వార్తలు
మెట్రో అధికారులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్
విజయ్ దేవరకొండ ఆర్థిక సహాయం: గోల్డ్ మెడల్ కొట్టిన కిక్ బాక్సర్