పెట్రోల్ రేట్లు పెరుగుతుంటే తమాషా చూస్తున్నారా?

పెట్రోల్ రేట్లు పెరుగుతుంటే తమాషా చూస్తున్నారా?

కేంద్ర ప్రభుత్వంపై ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి విరుచుకుపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుంటే కేంద్రం ఏమీ పట్టనట్లు చోద్యం చూస్తోందని ఫైర్ అయ్యారు. ఇది చాలా బాధాకరమన్నారు. ‘దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. కోట్లాది మంది తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలు సాయం కోసం అడుగుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఏమీ పట్టనట్లు మౌనం వహిస్తోంది’ అని మాయావతి విమర్శించారు.

పెట్రోల్, డీజిల్‌‌తో పాటు గ్యాస్ సిలిండర్ల ధరలు కూడా పెరుగుతుండటంపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ మండిపడ్డారు. ప్రజల సొమ్మును దోచుకుని తమకు అనంగులైన ఇద్దరికి దోచి పెడుతున్నారని కేంద్రాన్ని రాహుల్ విమర్శించారు.