
‘అగ్నిపథ్’ ఆందోళనకారుల కట్టడికి ఈనెల 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పోలీసులు జరిపిన కాల్పుల్లో యువకుడు దామెర రాకేష్ మృతిచెందాడు. అతడి కుటుంబంలో అర్హులైన ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ఇటీవల ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నారు. ఈ ప్రకటనను అనుసరించి.. రాకేష్ అన్న అయిన దామెర రామ్ రాజు కు ఉద్యోగం కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దామెర రామ్ రాజు విద్యార్హతలకు అనుగుణంగా వరంగల్ జిల్లాలో తగిన ఉద్యోగం ఇవ్వాల్సిందిగా ఆ ఉత్తర్వుల్లో జిల్లా కలెక్టర్ ను సీఎస్ ఆదేశించారు.