దేశం కోసం ప్రత్యర్థి పార్టీలతో కలసి నడిచేందుకూ రెడీ

దేశం కోసం ప్రత్యర్థి పార్టీలతో కలసి నడిచేందుకూ రెడీ

న్యూఢిల్లీ: దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైతే ప్రత్యర్థి పార్టీలతో కలసి నడవడానికీ సిద్ధమేనని ప్రధాన మోడీ అన్నారు. దీన్‌‌దయాళ్ ఉపాధ్యాయ 53వ వర్దంతి కార్యక్రమంలో పాల్గొన్న మోడీ.. బీజేపీ పాలన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశాభివృద్ధి కోసం రాజనీతిని పక్కనబెట్టి రాష్ట్రనీతికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ప్రత్యర్థి పార్టీలను గౌరవిస్తూ కలుపుకుపోయేందుకు బీజేపీ తాము రెడీగా ఉన్నామని తెలిపారు.

‘దేశంలో జరుగుతున్న సానుకూల మార్పులపై భారతీయులందరూ గర్వంగా ఉన్నారు. దేశ వాసుల కలలను నెరవేరుస్తున్నందుకు మేం గర్విస్తున్నాం. బీజేపీ సిద్ధాంతాలు దేశభక్తి, దేశ ఆసక్తులతో ముడిపడి ఉన్నాయి. మా పాలనలో జాతీయతకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. రాజకీయాల్లో ఏకాభిప్రాయాన్ని మేం గౌరవిస్తాం. పాలనలో సర్వామోదత కీలకం. మేం ప్రభుత్వాన్ని నడిపేందుకే కాదు దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అధికారంలోకి వచ్చాం. రాజకీయాల్లో ఇతర పార్టీలతో పోరాడినంత మాత్రాన మేం వారిని గౌరవించమని కాదు’ అని మోడీ పేర్కొన్నారు.