ఎయిర్ ఫోర్స్ కొత్త చీఫ్ గా వీఆర్ చౌధరి

ఎయిర్ ఫోర్స్ కొత్త చీఫ్ గా వీఆర్ చౌధరి

న్యూఢిల్లీ: భారత ఎయిర్ ఫోర్స్ కొత్త చీఫ్ గా ఎయిర్  మార్షల్ వీఆర్ చౌదరిని నియమించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం భారత వైమానిక దళం ఉపాధ్యక్షుడు (డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్) గా ఉన్న ఈయనను భారత వాయుసేన కొత్త చీఫ్ గా నియమించనున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది.  వెంకటరామ్ చౌదరి 29 డిసెంబర్ 1982 న ఎయిర్ ఫోర్స్  యుద్ధ విభాగంలో చేరారు. ఎయిర్ ఫోర్స్ లో ఈయనకు వివిధ రకాల ఫైటర్ మరియు ట్రైనర్ ఎయిర్‌ క్రాఫ్ట్ లను 3800 గంటలకు పైగా నడిపిన అనుభవం ఉంది.

ప్రస్తుత ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఆర్కేఎస్ భదౌరియా ఈనెల 30 న పదవీ విరమణ చేయనుండడంతో  ఆయన నుంచి చౌదరి కొత్త చీఫ్ గా బాధ్యతలు చేపడతారు. వివేక్ రామ్ చౌదరి ఈ ఏడాది జూలై 1 న వైమానిక సిబ్బంది డిప్యూటీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. వైమానిక దళానికి వైస్ చీఫ్‌గా నియమించబడటానికి ముందు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ (డబ్ల్యూఏసీ) కమాండర్-ఇన్-చీఫ్‌గా పనిచేశారు. సున్నితమైన లడఖ్ ప్రాంతంలో అలాగే ఉత్తర భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో దేశ గగనతలాన్ని రక్షించే బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించడం వల్లే పదోన్నతికి ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.