వ్యాక్సిన్‌‌లను కేంద్రమే కొని రాష్ట్రాలకు పంపిణీ చేయాలె

వ్యాక్సిన్‌‌లను కేంద్రమే కొని రాష్ట్రాలకు పంపిణీ చేయాలె

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ వ్యాక్సిన్ పాలసీపై సుప్రీం కోర్టు మండిపడింది. టీకాలను కొనుగోలు చేసి రాష్ట్రాలకు పంపిణీ చేసే బాధ్యత కేంద్రానిదేనని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది. వ్యాక్సిన్ కొనుగోలు కోసం పలు రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లు వేస్తుండటంతో సుప్రీం పైవిధంగా స్పందించింది. టీకా కోసం రాష్ట్రాలు టెండర్లు వేయడమే కేంద్రం పాలసీనా అంటూ చురకలు అంటించింది. ఇప్పటివరకు కరోనా వ్యాక్సిన్‌ల విషయంలో నేషనల్ పాలసీ డాక్యుమెంట్‌ను సమర్పించడంలో కేంద్రం విఫలమైందని కోర్టు ఫైర్ అయ్యింది. అలాగే 18 ఏళ్లు పైబడిన వారికి టీకాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించింది. తాము అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ రెండు వారాల్లోగా అఫిడవిట్‌ను సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది.