నిమ్స్‌లో 132 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల భ‌ర్తీకి గ్రీన్ సిగ్నల్

నిమ్స్‌లో 132 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల భ‌ర్తీకి గ్రీన్ సిగ్నల్

హైద‌రాబాద్ నిమ్స్‌లో 132 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టుల‌న్నింటినీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విధానంలో భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించిన నోటిఫికేష‌న్ త్వర‌లోనే వెలువ‌డ‌నుంది. క్యాడ‌ర్ వైస్ వెకేన్సీ పొజిష‌న్, రోస్టర్ పాయింట్లు, అర్హత‌ల ఆధారంగా అభ్యర్థుల‌ను ఎంపిక చేయ‌నున్నారు.

నిమ్స్పై పెరుగుతున్న ఒత్తిడి

మరోవైపు నిమ్స్ హాస్పిటల్ కు రోగుల తాకిడి రోజురోజుకి పెరుగుతోంది. కార్పొరేట్ హాస్పిటల్స్ కు వెళ్లలేని పేదలు.. వైద్యం కోసం నిమ్స్ కు క్యూ కడుతున్నారు. అయితే హాస్పిటల్ లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ నుంచి ఓపి వరకూ అన్నీ సమస్యలే కనిపిస్తున్నాయి. నిమ్స్ లో చికిత్సపై ఫిర్యాదులు ఎక్కువవుతుండటంతో వాటిని పరిష్కరించడంలో అధికారులు విఫలమవుతున్నారు. రోజురోజుకు పెరుగుతున్న పేషెంట్స్ కు ప్రస్తుతం ఉన్న డాక్టర్లు ట్రీట్ మెంట్ ఇవ్వలేక తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ముఖ్యంగా ఎమర్జెన్సీ  సర్వీస్ లో ఆలస్యం పేషెంట్స్ ప్రాణాల మీదకు తెస్తోంది. ఒక్క పేషెంట్ ను చూడ్డానికి కనీసం రెండు గంటలు వెయిట్ చేయాల్సి వస్తోందని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఇటీవల మెట్ పల్లికి చెందిన పేషంట్ మోహన్ సర్జరీ కోసం ఎల్ ఓసి తెచ్చుకున్నా.. బెడ్ లేట్ గా ఇవ్వడంతో... అతను చనిపోయాడంటూ బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.