మా ఫోన్లను కేంద్రం హ్యాక్ చేసింది

మా ఫోన్లను కేంద్రం హ్యాక్ చేసింది

కోల్‌కతా: దేశ రాజకీయాల్లో పెగాసస్ స్పైవేర్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పలువురు కేంద్ర మంత్రులు, విపక్ష నేతలు, ప్రముఖ వ్యాపారవేత్తలు, జర్నలిస్టుల ఫోన్లు హ్యాక్ కు గురయ్యాయన్న వార్త సంచలనంగా మారింది. ఈ విషయంపై కేంద్రాన్ని విమర్శిస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు. తాజాగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా కేంద్రంపై మాటల తూటాలు పేల్చారు. 
స్పైవేర్ నుంచి రక్షణ కోసం ప్రజలు డబ్బులు చెల్లిస్తున్నారని అయినా సేఫ్టీ లేకుండా పోతోందని దీదీ మండిపడ్డారు. తమ ఫోన్లను హ్యాక్ చేశారంటూ బీజేపీ ప్రభుత్వం పై ఆరోపణలకు దిగారు. 'కొన్ని రోజుల కింద ప్రశాంత్ కిశోర్ తో పాటు మరికొందరితో పెట్టిన మీటింగ్ లో నేనూ పాల్గొన్నాను. మా మీటింగ్స్ కు సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి కేంద్రం క్లోన్ చేసింది. పీకే తన ఫోన్ ను ఆడిట్ చేయించడంతో మా మీటింగ్స్ లో ఒక దాన్ని పెగాసస్ స్పైవేర్ సాయంతో క్లోన్ చేశారని మాకు తెలిసింది' మమత పేర్కొన్నారు.