రేపటి జీపీవో ఎగ్జామ్​కు ఏర్పాట్లు పూర్తి

రేపటి జీపీవో ఎగ్జామ్​కు ఏర్పాట్లు పూర్తి

నిజామాబాద్, వెలుగు : జిల్లాలో ఆదివారం జరగనున్న గ్రామ పాలనా అధికారి (జీపీవో) ఎగ్జామ్​కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అడిషనల్​ కలెక్టర్ కిరణ్​కుమార్ తెలిపారు. శుక్రవారం తన చాంబర్​లో జీపీవో పరీక్షపై నిర్వహించిన సమీక్షలో అడిషనల్​ కలెక్టర్​ మాట్లాడారు.  నగరంలోని గవర్నమెంట్ గిరిరాజ్ డిగ్రీ కాలేజీలో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష జరగనుందని, 330 మంది  పరీక్ష రాయనున్నారని తెలిపారు. గంట ముందు నుంచే సెంటర్​లోకి అనుమతించాలన్నారు. 

పరీక్ష సాఫీగా ముగిసేలా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని,  ఎగ్జామ్​ స్టార్ట్​ అయ్యాక అనుమతించొద్దని తెలిపారు. సమీక్షలో ఆర్డీవో రాజేంద్రకుమార్, జిల్లా ట్రాన్స్​ఫోర్ట్​ఆఫీసర్ ఉమా మహేశ్వర్​రావు, ఏసీపీలు రాజావెంకట్​రెడ్డి, వెంకటేశ్వర్, తహసీల్దార్ బాలరాజ్, సూపరింటెండెంట్ పవన్ తదితరులు పాల్గొన్నారు. 

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో జీపీవో ఎగ్జామ్​

కామారెడ్డి టౌన్, వెలుగు : ఈ నెల 25న జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో జీపీవో ఎగ్జామ్​ ఉంటుందని కామారెడ్డి కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్​లో ఎగ్జామ్​ నిర్వహణపై అధికారులు, ఇన్విజిలేటర్లతో నిర్వహించిన మీటింగ్​ కలెక్టర్​ మాట్లాడారు. మాస్​కాపీయింగ్​కు తావులేకుండా పకడ్బందీగా పరీక్ష నిర్వహించాలన్నారు.  ఉదయం 10.30 నుంచి మద్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష ఉంటుందని, 402 మంది అభ్యర్థులు హాజరవుతారన్నారు. పరీక్ష కేంద్రంలో సరైన వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు.  సమీక్షలో అడిషనల్ కలెక్టర్​ విక్టర్,​ ఏఎస్పీ చైతన్యరెడ్డి,  ఆర్డీవో వీణ తదితరులు పాల్గొన్నారు.