న్యూఢిల్లీ: ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్లు (ఐఏ), రీసెర్చ్ అనలిస్ట్‌లు (ఆర్ఏ) కోసం విద్యార్హతలను సెబీ మార్చింది. కొత్త నిబంధనల ప్రకారం.. ఏదైనా విభాగం నుంచి గ్రాడ్యుయేట్ అయిన వారు వీటి రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్స్ (నిస్సమ్) సర్టిఫికేషన్ పరీక్షలో పాసవడం తప్పనిసరి.
వ్యక్తిగత ఐఏలకు కార్పొరేటైజేషన్ ప్రక్రియను కూడా సెబీ సులభతరం చేసింది. ఒక వ్యక్తిగత ఐఏ క్లయింట్‌ల సంఖ్య 300 లేదా ఫీజు రూ.మూడు కోట్లు పరిమితిని దాటితే, నాన్-ఇండివిడ్యువల్ సంస్థగా మారడానికి ఆరు నెలల సమయం లభిస్తుంది. ప్రిన్సిపల్ అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవడానికి మూడు నెలలు, మార్పు పూర్తి చేయడానికి అదనంగా మరో మూడు నెలలు గడువు ఉంటుంది. ఈ కాలంలో కొత్త క్లయింట్‌లను తీసుకోవడానికి, ఫీజులు వసూలు చేయడానికి ఐఏకు అనుమతి ఉంటుంది.
