
దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ గ్రాండ్ గా జరిగింది. ఎయిర్ ప్యారచూట్ విన్యాసాలతో ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ఆకట్టుకున్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న 152 మంది పరేడ్ లో పాల్గొన్నారు. వీరిలో 24 మంది విమెన్ ఆఫీసర్స్ ఉన్నారు. చీఫ్ మార్షల్ బిరేందర్ సింగ్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న ఆఫీసర్స్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఆఫీసర్స్ డ్యూటీ లో ప్రతీ నిమిషం అలర్ట్ గా ఉండాలన్నారు . అరుణాచల్ ప్రదేశ్ లో క్రాష్ అయిన ఎయిర్ క్రాఫ్ట్ ని రికవరీ చేశామన్నారు బీరేందర్ సింగ్.