కాగజ్‌నగర్, వెలుగు : సాధారణంగా గెలిచిన క్యాండిడేట్లే హామీలను నెరవేరుస్తుంటారు. కానీ సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయిన రెండో రోజే.. ఇచ్చిన హామీని నెరవేర్చింది ఓ క్యాండిడేట్. వివరాల్లోకి వెళ్తే.. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం కనికి గ్రామంలో సర్పంచ్‌గా పోటీ చేసిన బండి విజయలక్ష్మి ప్రచారంలో భాగంగా.. తనను గెలిపిస్తే గ్రామంలోని హనుమాన్ టెంపుల్ వద్ద బోర్ వేయిస్తానని హామీ ఇచ్చింది.
కానీ 171 ఓట్ల తేడాతో ఓడిపోయింది. అయినప్పటికీ.. ఆమె మద్దతుదారులంతా కలిసి డబ్బు పోగు చేసుకొని హనుమాన్ టెంపుల్ వద్ద బోర్ వేయడం ప్రారంభించారు. దీంతో విజయలక్ష్మి అప్పటికప్పుడు బోర్ మోటార్ కొని, ఫిట్ చేయించింది. సర్పంచ్‌గా ఓడిపోయినప్పటికీ.. ఇచ్చిన మాట ప్రకారం బోర్ వేయించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
