ప్రారంభమైన ఎత్తం గట్టు బ్రహ్మోత్సవాలు

ప్రారంభమైన ఎత్తం గట్టు బ్రహ్మోత్సవాలు

కోడేరు, వెలుగు : కొల్లాపూర్ నియోజక వర్గ పరిధిలోని కోడేరు మండలం ఎత్తం గ్రామ సమీపంలోని రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా సంక్రాంతి పండుగ సందర్భంగా 14,15,16 తేదీల్లో ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. బుధవారం రామలింగేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర, రాయచూర్ ప్రాంతాల నుంచి వేలాది సంఖ్యలు భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. 

15న మకర సంక్రాంతి సందర్భంగా కండ్ల నీలాలు, విష్ణుపటం, కోరమీసాలు కలిగి ఉన్న రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. -16న స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. మూడు రోజులపాటు అన్నదానం, తీర్థప్రసాదాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.