
హైదరాబాద్ లో ముస్లింలు మిలాద్-ఉన్-నబీ ర్యాలీలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో మక్కా మసీదు వద్ద ప్రార్ధన చేసి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ గుల్జార్ హౌజ్, పత్తర్‌గట్టి, మదీనా, నయాపూల్, దారుల్ఫిషా, పురానీ హవేలి, మీర్ ఆలం మండి, ఎతేబార్ చౌక్, మొఘల్‌పురా వరకు కొనసాగింది. అలాగే ఫలక్‌నుమా, మిస్రిగంజ్ప్రాంతాల నుంచి మరికొన్ని ర్యాలీలు జరిగాయి. ఊరేగింపు ప్రశాంత వాతావరణంలో సాగేందుకు సిటీ పోలీసులు 3 వేల మందితో బందోబస్త్ ఏర్పాటు చేశారు.
– వెలుగు, హైదరాబాద్ సిటీ–