తెలుగు సంవత్సరాది శ్రీపరాభవ నామ ఉగాది వేడుకలు సిటీలో గురువారం వైభవంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాలు భక్తులతో కిటకిటలాడగా, ప్రతి ఇంటా ఉగాది పచ్చడి రుచులతో పండుగ వాతావరణం నెలకొంది. పంచాంగ శ్రవణాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
