వైభవంగా పార్వతి పరమేశ్వరుల కల్యాణోత్సవం

వైభవంగా పార్వతి పరమేశ్వరుల కల్యాణోత్సవం

హైదరాబాద్, వెలుగు: నారాయణగూడలోని శ్రీ భూలక్ష్మి దుర్గా దేవి ఆలయంలో శ్రీ పార్వతీ పరమేశ్వరుల కల్యాణోత్సవం భక్తి శ్రద్ధల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ వేద పండితులు శాస్త్రోక్తంగా, వేద మంత్రోచ్ఛారణల నడుమ ఈ కల్యాణ వేడుకను నిర్వహించారు. భక్తుల మంత్రోచ్ఛారణలతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.

ఈ సందర్భంగా లోక కల్యాణార్థం, ప్రజల శ్రేయస్సు, రాష్ట్రాభివృద్ధిని కాంక్షిస్తూ వేద పండితులు ప్రత్యేక సంకల్ప పూజలు నిర్వహించారు. భక్తులందరికీ అమ్మవారి ఆశీస్సులతో అభివృద్ధి, విజయం చేకూరాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నల్లెల్ల కిశోర్, పి. బాలరాజ్ గౌడ్, ప్రదీప్ గౌడ్, యాదగిరి గౌడ్, బి. శ్యామ్, కిరణ్ కుమార్ తదితరులతో పాటు స్థానిక భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.