రేణుక ఎల్లమ్మ ఆలయంలో ఘనంగా నవ చంఢీయాగం

రేణుక ఎల్లమ్మ ఆలయంలో ఘనంగా నవ చంఢీయాగం

నిర్మల్, వెలుగు: నిర్మల్ గీత పారిశ్రామిక సహకార సంఘం, గౌడ సంఘం ఆధ్వర్యంలో అక్కాపూర్ గ్రామంలో నిర్మిస్తున్న రేణుక ఎల్లమ్మ మాత విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాల్లో భాగంగా మంగళవారం నవ చంఢీయాగం నిర్వహించారు. 35 మంది దంపతులు హోమంలో పాల్గొని 13 అధ్యాయాలతో యాగం చేశారు. ఐదు రోజుల పాటు జరుగుతున్న ఉత్సవాల్లో పెద్దఎత్తున గౌడ కులస్తులు పాల్గొంటున్నారు.

దైవజ్ఞ గురుమంచు చంద్రశేఖర శర్మ ఆధ్వర్యంలో ఘనాపాటి మణికంఠ శర్మ, వేద పండితులు  విద్యాసాగర్ శాస్త్రి, శివరామకృష్ణ, వినోద్ కుమార్ సహా తిరుపతి, బీదర్, అచ్చులాపూర్ తదితర ప్రాంతాల నుంచి వేద పండితులు పాల్గొన్నారు. సోమవారం జలా ధివాసం చేసిన రేణుక ఎల్లమ్మ సహా జమదగ్ని, వినాయకుడు ఇతర విగ్రహాలను ఆలయ ప్రాంగణానికి తరలించారు. మంగళవారం విగ్రహాల దాన్యాధివాసం కార్యక్రమంతో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.