కామారెడ్డి కలెక్టరేట్లో సర్దార్ పాపన్నకు ఘన నివాళి

 కామారెడ్డి కలెక్టరేట్లో సర్దార్ పాపన్నకు ఘన నివాళి

కామారెడ్డి టౌన్, వెలుగు : కామారెడ్డి కలెక్టరేట్​లో సోమవారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్​జయంతి వేడుకలు నిర్వహించారు.  కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ పాపన్న ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాపన్నగౌడ్ పోరాట స్ఫూర్తి, సేవలను కొనియాడారు. అధికారులు, గౌడ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.  

నిజామాబాద్​లో..

నిజామాబాద్, వెలుగు : జిల్లాలో సోమవారం సర్దార్​ సర్వాయి పాపన్న గౌడ్​ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని వినాయక్​నగర్​లోని పాపన్నగౌడ్ విగ్రహానికి కలెక్టర్​ వినయ్​కృష్ణారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అన్యాయం, దౌర్జన్యాన్ని ఎదురించిన పాపన్నగౌడ్ పోరాట పటిమ, ధైర్యం స్ఫూర్తిదాయకమన్నారు. బీసీ సంక్షేమ శాఖ అధికారి నర్సయ్య, గౌడ, బీసీ కులసంఘాల నేతలు ఉన్నారు.