చండూరు (గట్టుపల్), వెలుగు: గట్టుప్పల్ మండలం తేరటుపల్లి గ్రామంలో పెద్దమ్మ గుట్టపై లక్ష్మీ గోదాసమేత చెన్నకేశవ స్వామి వార్షికోత్సవాలు సోమవారం కన్నుల పండువగా జరిగాయి. ముందుగా సుప్రభాత సేవతో మొదలైన పూజా కార్యక్రమంలో స్వామివారికి పంచామృత అభిషేకం, ప్రత్యేక పూజలు, అర్చనలు, హోమాలు చేశారు.
అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వేద పండితులు మాడా పాపయ్య శర్మ, పవన్ శర్మ ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణోత్సవం జరిగింది. భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదానం చేశారు. ఆలయ అర్చకులు వర్కాల అశోక్, ఆలయ చైర్మన్ సతీశ్చంద్ర, రవికుమార్, విజయ రంగారావు, సర్పంచ్ సింగం వెంకటేశం, మాజీ ఎంపీటీసీ సత్తయ్య, గిరి నరసింహ పాల్గొన్నారు.
