నిఖత్​ జరీన్​కు ఘనస్వాగతం

నిఖత్​ జరీన్​కు ఘనస్వాగతం
  • నిఖత్​ జరీన్​కు ఘన స్వాగతం
  • నజరానాలు ప్రకటించిన మంత్రి, ఎమ్మెల్యేలు 

నిజామాబాద్ టౌన్, వెలుగు:  టర్కీ లో జరిగిన బాక్సింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించి గురువారం నిజామాబాద్ వచ్చిన నిఖత్​జరీన్​కు ఘన స్వాగతం లభించింది. ఫులాంగ్ చౌరస్తా నుంచి తిలక్ గార్డెన్ వరకు భారీ ఊరేగింపు నిర్వహించారు. తర్వాత అంబేద్కర్ భవన్​లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జరీన్​కు రూ.లక్ష , ఆమె ​కోచ్ షంషుద్దీన్​కు రూ.50 వేల చెక్కును అందజేశారు. అర్బన్​ఎమ్మెల్యే గణేశ్​గుప్తా బిగాల కృష్ణమూర్తి ఫౌండేషన్ తరఫున రూ.లక్ష నగదు ఇచ్చారు. బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ బోధన్ లో 200 గజాల స్థలం కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కలెక్టర్ నారాయణ రెడ్డి, సీపీ నాగరాజు, జడ్పీ చైర్మన్  విఠల్​రావు పాల్గొన్నారు.