కేసీఆర్ తాత..  మాకేంటి ఈ బాధ

కేసీఆర్ తాత..  మాకేంటి ఈ బాధ
  • చంటి పిల్లలతో జీపీఎస్‌‌ల సమ్మె

మెదక్, వెలుగు: తమను రెగ్యులరైజేషన్ చేయాలని మెదక్​ కలెక్టరేట్ వద్ద 4రోజులుగా సమ్మె చేస్తున్న జీపీఎస్‌‌లు సోమవారం పిల్లలతో కలిసి కూర్చున్నారు. ‘ కేసీఆర్ తాత మాకేంటి ఈ బాధ’, ‘మా అమ్మా నాన్నల ఉద్యోగాలు రెగ్యులర్ చేయండి’  అని రాసి ఉన్న  ప్లకార్డులను పిల్లలు ప్రదర్శించారు.  తమ డిమాండ్​లు నెరవేర్చే వరకు సమ్మె కొనసాగిస్తామని 
అసోసియేషన్​ జిల్లా అధ్యక్షుడు కుమార్, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి తెలిపారు.