హైదరాబాద్, వెలుగు: ఎముకల సంబంధిత సమస్యల కోసం హైదరాబాద్ ఫార్మా కంపెనీ గ్రాన్యూల్స్ తయారు చేసిన రుక్సోలిటినిబ్ ఎక్స్‌టెండెడ్ రిలీజ్ టాబ్లెట్ల అమ్మకాల కోసం యూఎస్ఎఫ్డీఏకు దరఖాస్తు దాఖలు చే సింది. దీనికి సంబంధించి పేరా 4 సర్టిఫికేషన్ సమర్పించింది.
ఈ దరఖాస్తు దాఖలు చేసిన స మయం, స్థానాన్ని బట్టి కంపెనీకి ఫస్ట్ టు ఫైల్ హోదా లభించే అవకాశం ఉంది. ఎఫ్‌డీఏ పరిశీలన పూర్తయి ఈ హోదా ఖరారైతే ఆర్నెళ్ల పాటు జెనెరిక్ మెడిసిన్ ఎక్స్‌క్లూజివిటీ హక్కులు లభిస్తాయి.
