
హైదరాబాద్, వెలుగు : అధిక రక్తపోటు (పల్మనరీ ఆర్టరీ హైపర్‌టెన్షన్) చికిత్సకు ఉపయోగించే 'సిల్డెనాఫిల్' ఓరల్ సస్పెన్షన్ అబ్రివియేటెడ్ న్యూ డ్రగ్ అప్లికేషన్ (ఏ ఎన్ డీ ఏ)కు యూఎస్ ఫుడ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ ఎఫ్ డీ ఏ) ఆమోదం తెలిపినట్లు గ్రాన్యూల్స్ ప్రకటించింది.
ఇది రిఫరెన్స్ లిస్టెడ్ డ్రగ్ (ఆర్ఎల్డీ) రెవాటియో ఓరల్ సస్పెన్షన్కు బయో ఈక్వలెంట్. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని పల్మనరీ ఆర్టరీ హైపర్‌టెన్షన్ చికిత్స కోసం సూచించింది. గ్రాన్యూల్స్కు ఇప్పుడు యూఎస్ ఎఫ్ డీ ఏ నుంచి మొత్తం 63 ఏఎన్డీఏ ఆమోదాలు ఉన్నాయి. వీటిలో 61 ఫైనల్ కాగా, 2 తాత్కాలిక ఆమోదాలు.