V6 News

రాష్ట్ర ప్రభుత్వంతో గ్రావ్టన్ ఒప్పందం

రాష్ట్ర ప్రభుత్వంతో గ్రావ్టన్ ఒప్పందం

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో బలమైన క్లీన్-మొబిలిటీ పర్యావరణ వ్యవస్థ కోసం ఈవీ తయారీ సంస్థ గ్రావ్​టన్​​ మోటార్స్ సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. 

రైజింగ్ గ్లోబల్ సమ్మిట్​లో ఒప్పందంపై సంతకాలు జరిగాయి. గ్రావ్​టన్​ మోటార్స్ ఈవీ పవర్​ట్రెయిన్ ఉత్పత్తి, ఈవీ టూ-వీలర్ తయారీ, అటానమస్ గ్రౌండ్ వెహికల్ (ఏజీవీ) అభివృద్ధికి అధునాతన సదుపాయాలను ఏర్పాటు చేయనుంది. టీజీ -ఐపాస్ ద్వారా ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌‌‌‌కు  సహకరిస్తుంది.