ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు.. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు

ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు.. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు

యేసుక్రీస్తు సిలువపై ప్రాణాలను అర్పించిన రోజును గుడ్ ఫ్రైడే గా జరుపుకుంటారు. చాలా మంది తెలియని వారు గుడ్ ఫ్రైడే అంటే ఏదో పండగలా భావిస్తారు. ఇందుకు కారణం ఆ పదంలో గుడ్ అంటే శుభం అని ఉండటమే. వాస్తవానికి గుడ్ ఫ్రైడే అంటే క్రైస్తవుల ప్రకారం మానవాళి చేసిన పాపాల కోసం తన ప్రాణాలను జీసస్ సిలువపై పణంగా పెట్టాడని చెబుతారు.

గుడ్‌ఫ్రైడే రోజు క్రైస్తవ సోదరులు ఏసుక్రీస్తును భక్త శ్రద్ధలత నిష్టగా పూజిస్తే.. పుణ్య ఫలితాలతో అనుగ్రహిస్తాడని విశ్వాసం. పవిత్ర వారమంతా ఉపవాసముండి ఈస్టర్ విందు తీసుకునే వారికి క్రీస్తు సకల భోగభాగ్యాలను ప్రసాదించి, ఈతిబాధలను తొలగిస్తాడని విశ్వాసుల నమ్మకం.

తెలుగు రాష్ట్రాల్లోని చర్చిలలో భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్‌ చర్చిలో 2024 మార్చి 29 శుక్రవారం గుడ్‌ఫ్రైడే  వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వందలాది మంది భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. గుడ్‌ ఫ్రైడే సందర్భంగా మెదక్‌ చర్చిలోకి పలు జిల్లాల నుంచి క్రైస్తవులు భారీగా తరలిరావడంతో.. చర్చి ప్రాంతం కిటకిటలాడింది. ఏసయ్య భక్తి గీతాలను ఆలపిస్తున్నారు.